బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
By bhavana
కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది.
బార్లీ నీళ్లు రోజూ తాగితే మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.
బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
బార్లీ నీళ్లు తాగితే.. క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్, రాగి.. వంటి మినరల్స్, సాల్ట్స్ తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల శరీరానికి అందుతాయి.
షుగర్ పేషెంట్స్‌కు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది.
ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
బార్లీ నీటిని తాగడం వల్ల చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోన్లు ఇట్టే కరిగిపోతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి.