ఔషధ గుణాలు బాగా ఉండే మెంతి కూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మెంతి ఆకుల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ. అలాగే ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఏ, బీ, సీ, డీ ఉన్నాయి.
TWITTER
గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. మెంతి ఆకులు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి..అలాగే శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఉపయోగపడతాయి.
మెంతి ఆకులో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.చర్మంపై ముడతల్ని తొలగిస్తాయి. ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.
టైప్ 2 డయాబెటిస్‌ని ఈ ఆకులు బాగా కంట్రోల్ చెయ్యగలుగుతున్నాయని నిపుణులు తెలిపారు.
మన శరీరంలోకి చొరబడేందుకు విష వ్యర్థాలు, సూక్ష్మక్రిములు చాలా ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటిని అడ్డుకునే శక్తి మెంతి కూరకు ఉంది.
జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి.
మెంతి ఆకుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. చుండ్రును తగ్గిస్తాయి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. అలాగే లివర్ కణాలు దెబ్బ తినకుండా ఈ ఆకులు కాపాడతాయి.
స్థియోపోరోసిస్ సమస్య వల్ల పెళుసుగా మారిన ఎముకలు తిరిగి గట్టిగా అయ్యేలా చెయ్యడంలో మెంతి ఆకులు బాగా పని చేస్తాయి.