నారింజలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి.
నారింజ శరీరపు కఫ, వాత, అజీర్ణాలను హరించి శరీరానికి బలం, తేజస్సు కలిగిస్తుంది.
యవ్వనాన్ని పెంపొందింపజేస్తుంది.
జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, గంధకం, క్లోరిన్‌లు నారింజలో లభిస్తాయి.
నారింజ పండు వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు ఉపశమిస్తాయి.
చిగుళ్ల వాపు, రక్తం కారటం, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి.
జీర్ణశక్తి పుంజుకుంటుంది.
గుండె జబ్బుల ప్రమాదాన్ని 20%తగ్గిస్తుంది.
తలనొప్పి, సాధారణ జలుబులకు గొప్ప నివారణ
ఆస్తమా ప్రమాదం నుంచి బయటపడొచ్చు
పేగుల్లోని క్రిములు నశిస్తాయి.