రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.

నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు 24 శాతం వరకు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

నిత్యం ఈ జ్యూస్‌ తాగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుంది.

ఈ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎంతో ఉపయోగపడుతుంది.

చర్మ సౌందర్యం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఆరెంజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరెంజ్ జ్యూస్ మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

నారింజ తొక్క మొటిమలను తొలగించడానికి, నల్లటి మచ్చలను పోగొట్టడానికి, జిడ్డుగల చర్మాన్ని తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది

ఈ జ్యూస్ లో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటాయి.