మండే ఎండల వల్ల.. గొంతు ఎండిపోతుంది, డీహైడ్రేషన్‌, అలసట, నిస్సత్తువ, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి.

వేసవి తాపం తట్టుకోవడానికి.. బెస్ట్‌ రిఫ్రెష్‌మెంట్‌ డ్రింక్‌.. కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగితే.. డీహైడ్రేషన్‌, ఎండ వేడిని తగ్గడమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.

కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. 

కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

కొబ్బరి నీరు కడుపుని శాంతపరుస్తుంది. ప్రేగు కదలకలను సులభతరం చేస్తుంది. కొబ్బరినీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. 

మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

ఎసిడిటీతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే.. ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి.

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి.