కరివేపాకుతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

దీనిలో విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలం

ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం ఆరోగ్యం పై సానుకూల ప్రభావం చూపుతుంది.

ఉదయం ఏమీ తినకుండా కరివేపాకు నమలడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది ఉదయాన్నే కళ్ళు తిరగడం, బలహీనత, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

కరివేపాకు శరీరాన్ని డీ టాక్సీఫై చేయడంలో సహాయపడుతుంది.

ఉదయాన్నే మరిగించిన కరివేపాకు నీళ్లు తాగడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది.