కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. అందుకే, మన ఇళ్లల్లో కరివేపాకు లేనిదే వంట పూర్తికాదు. 

కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, వివిధ రకాల ఔషధ గుణాల ఉన్నాయి. అందువల్ల కరివేపాకును కేవలం వంటల్లోనే కాకుండా.. వివిధ ఔషదాల్లోని ఉపయోగిస్తారు.

జుట్టు సమస్యలను నివారించేందకు కరివేపాకు ఉపయోగపడుతుంది.

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. అజీర్తి, ఎక్సెసివ్ యాసిడ్స్ ఉత్పత్తిని నివారిస్తుంది.

కరివేపాకు చర్మం సంరక్షణకు సహాయపడుతుంది. ఆకులు రసం లేదా పేస్ట్ కాలిన, తెగిన గాయాలు, చర్మం దురదలు తగ్గించడానికి ఉపయోపడతాయి.

ఆమ్లశ్రావం, జీర్ణ పూతలు, ఎముకల అరుగుదలకు, డయాబెటిస్, అతిసారం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ సమస్యలను నియంత్రిస్తుంది.

శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్, ఫ్యాట్‌ను కరిగించి బరువు తగ్గిస్తుంది.