నల్ల పసుపులోనూ ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.నల్ల పసుపు మొక్కను నీలకంఠ, నరకచూర, కృష్ట కేదార అని కూడా పిలుస్తారు.
ఈ దుంపల నుంచి తయారు చేసిన పేస్ట్‌ను పాములు, తేళ్లు గాయలు, కాటుకు మందుగా వాడతారు.నల్ల పసుపు తీసుకుంటే శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆస్తమాటిక్, యాంటీఆక్సిడెంట్, అనాల్జేసిక్, లోకోమోటర్ డిప్రెసెంట్, యాంటీ కన్వల్సెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ అల్సర్, కండరాల సడలింపు ప్రభావాలు, యాంజియోలైటిక్, సీఎన్‌ఎస్ డిప్రెసెంట్ లాంటి లక్షణాలు ఉన్నాయి.
శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి నల్ల పసుపు మేలు చేస్తుంది.
జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి.
మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందడానికి నల్ల పసుపు సహాయపడుతుంది.నల్ల పసుపు చూర్ణంలా చేసి, నుదుటిపై పేస్ట్‌లాగా రాయండి.
credit: iStock
నెలసరి నొప్పినుంచి విముక్తి పొందడానకి.. నల్ల పసుపు పొడి కలిపిన వేడి పాలను తాగడం మంచిది.
నల్ల పసుపు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్లు, అజీర్ణం, అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటి సమస్యలు దరిచేరవు.
ఆహారంలో కొంత నల్ల పసుపు వేసుకుని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
నల్ల పసుపు మీ ఆహారంలో తీసుకుంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.