ఆవు, గేదె పాల కంటే మేక పాలు మానవ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరం అని చెబుతారు నిపుణులు 

మేక పాలలో పోషక విలువలు అధిక మొత్తంలో ఉంటాయి. 

మేక పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము 

మేక పాలలో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో తోడ్పడతాయి. 

మేక పాలు త్వరగా జీర్ణమవుతాయి. వీటిలోని తక్కువ ల్యాక్టోస్ కంటెంట్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

వీటిలోని మెగ్నీషియం, పాస్ఫరస్, క్యాల్షియం ఎముకలను దృఢంగా చేస్తాయి. 

మేక పాలలోని లినొలిక్ యాసిడ్ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుందని నిపుణుల అభిప్రాయం

ఈ పాలలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.