సాధారణంగా కొంత మందిలో ప్రతీ చిన్న విషయానికి ఓవర్ థింకింగ్ చేసే అలవాటు ఉంటుంది.

అతిగా ఆలోచించడం వ్యక్తి మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. 

అతిగా ఆలోచించే వారిలో కనిపించే కొన్ని అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం 

ఓవర్ థింక్ చేసేవారు ప్రతీ విషయంలో పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటారు. కొన్ని సార్లు ఇది ఇతరులకు ఇబ్బందిగా మారవచ్చు  

అతిగా ఆలోచించే వారు ప్రతీ విషయాన్నీ నెగిటివ్ కోణంలో ఆలోచిస్తారు. వారిలో సానుకూలత తక్కువగా ఉంటుంది.

ఇలాంటి వ్యక్తిత్వం మానసిక ఆరోగ్యాన్ని పాడుచేయడంతో పాటు క్రమంగా ఆత్మ విశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. 

అతిగా ఆలోచించేవారు చేసే పని కంటే ఆలోచించడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 

అతిగా ఆలోచించేవారు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కుంటారు.