గర్భవతులు ఆహారంలో నెయ్యి తీసుకోవచ్చా?

గర్భం దాల్చిన తర్వాత స్త్రీల మానసిక, శారీరక ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి.

గర్భధారణ సమయంలో బరువు పెరగడం సహజం. అందుకే నెయ్యి విషయంలో భయపడతారు

చాలా మంది ఈ సందర్భంలో నెయ్యి తీసుకోకుండా ఉంటారు.  ఎందుకంటే వారు మరింత బరువు పెరగవచ్చని భావిస్తారు.

ఒక్కసారి బరువు పెరిగితే తగ్గడం కష్టమని చాలా మంది ఈ నిర్ణయం తీసుకుంటారు.

కానీ,  నెయ్యి తీసుకోవడం తల్లి -బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కాబట్టి, ఇది శరీరానికి హాని కలిగించదు.

నెయ్యి మీ ఆహారం రుచిని పెంచడమే కాకుండా పిండం ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. నెయ్యి శరీరానికి శక్తినిచ్చి అలసిపోకుండా చేస్తుంది

చాలామంది గర్భధారణ  సమయంలో మలబద్ధకంతో బాధపడుతారు.   ఈ సమస్యతో బాధపడేవారికి  నెయ్యి దివ్యౌషధంగా పనిచేస్తుంది

నెయ్యిని సరైన పరిమితుల్లో తీసుకోవడం ద్వారా పిల్లల మెదడు చురుగ్గా మారుతుంది

గర్భిణీ స్త్రీలు రోజూ 1 నుండి 3 చెంచాల నెయ్యి తీసుకోవచ్చు. కానీ నెయ్యి తీసుకోవడం వల్ల ఏదైనా సమస్య వస్తుందని భయపడితే మీ వైద్యుడిని సంప్రదించండి