బరువు పెరగాలనుకునేవారికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఎక్కువ ఆహారం తినేందుకు వీలవుతుంది. తక్కువ నీరు తాగుతూ ఎక్కువ ఆహారం తినవచ్చు.

బాదంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల రోజూ బాదం పప్పులు కనీసం 4 తినాలి. రాత్రి నీళ్లలో 6 గింజలు నానబెట్టి... ఉదయం తొక్క తీసి ఆరింటినీ తినవచ్చు. అదే డైరెక్టుగా తింటే మాత్రం రోజుకు 4 తింటే సరిపోతుంది.

గుడ్లను ఉడకబెట్టి తింటే బరువు పెరుగుతారు. గుడ్లలో A, D విటమిన్లు,... మెగ్నీషియం, సోడియం, పొటాషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. రోజూ 1 గుడ్డు తిన్నా చాలు... మీరు క్రమంగా బరువు పెరుగుతారు.

కొబ్బరి పాలను మీ డైట్‌లో చేర్చండి. ఇవి మీ ఆహారంలో కేలరీలను పెంచుతాయి. మీ శరీరం పెరుగుతుంది. 

బరువు పెరగాలనుకునేవారు అరటిపండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. త్వరగా బరువు పెరిగేందుకు ఇవి సహకరిస్తాయి.

బ్రౌన్ రైస్‌ని ప్రజలు ఇప్పుడు బాగా వాడుతున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి, బరువునూ పెంచుతాయి.