ఆడవాళ్ళు అవిసె గింజలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపర్చడంలో, హార్మోన్లను సమన్వయం చేయడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి

క్యాన్సర్ కారకాలతో పోరాటం చేయడంలోనూ అవిసెగింజల్లోని ప్రత్యేక పోషకాలు కీలకంగా పనిచేస్తాయి

ఆడవాళ్ళు మెనోపాజ్ దశకు చేరుకున్న సమయంలో అవిసె గింజల్లో లభించే లిగ్ నాన్స్ ఎంతో మేలు చేస్తాయి

లిగ్ నాన్స్ కి ఈస్ట్రోజన్ గుణాలు అధికం.

హార్మోన్ల సమతూకం సాధనకూ.. ఓ ఔషదంలా ఉపయోగపడుతుంది

అంతే కాదు ఎముకలు దృఢంగా ఉండేందుకు అవిసెగింజలు తోడ్పడతాయి

ఇక ఆరోగ్యవంతమైన చర్మం,జుట్టు, గోళ్లు సొంతం చేసుకోవాలనుకుంటే రోజూ రెండు టేబుల్ స్పూన్ల అవిసెగింజల్ని తీసుకోవడం మంచిది.

దీనిలోని బి విటమిన్ కీలక కొవ్వులు చర్మం పొడిబారే తత్వాన్ని తగ్గిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం రోజూ రెండు స్పూన్లు అవిసెగింజలు క్రమం తప్పకుండా తీసుకోండి.