పాముకాటు వేసినా ముంగిసకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. ఎందుకంటే పాముకాటు ద్వారా విషయం ముంగిస శరీరంలోకి ప్రవేశించినా..ఒక మోతాదు విషం వరకు ముంగిస దాన్ని ఇమ్యూన్ చేసుకోగలదు.

మిగతా జీవులతో పోలిస్తే జన్యుపరంగా ముంగిస శరీరంలో నిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది.

హనీ బ్యాడ్జర్‌. పాము కాటు వల్ల వీటికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే అది ఏ పాము అయినా శరీరంలో విషం వ్యాపించదు. హనీ బ్యాడ్జర్స్ పాముల్ని కూడా చంపి తినేస్తాయి.

చెక్క ఎలుక..ఇది పాము విషం ద్వారా ఏమాత్రం ప్రభావితం కాదు.

కాలిఫోర్నియా గ్రౌండ్ స్క్విరెల్ ఒక రకమైన ఉడుత. ఇది సాధారణంగా అమెరికాలోని చిన్న గడ్డి భూములు, చెట్లతో కప్పబడిన కొండలు, గ్రానైట్ రాళ్లలో కనిపిస్తుంది. పాము కాటు వల్ల ఇది కూడా ప్రభావితం కాదు.

పాము పందిని కరిచినా చావదు. పంది శరీరంలో న్యూరోటాక్సిన్ అనే ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది, ఇది పాము విషాన్ని పనిచేయకుండా చేస్తుంది.

ఐరోపాలో కనిపంచే ముళ్లపందిని పాము కాటు వేసినా ఎటువంటి ప్రాణాపాయం కలుగదు. ఇది అచ్చంగా పందికొక్కులా కనిపించే ముళ్ల పంది.