ఈపీఎఫ్‌ విత్‌డ్రా ఎప్పుడు చేసుకోవాలి?

ఈపీఎఫ్‌లో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించింది

కొన్ని సందర్భాలలో పూర్తిగా లేదా పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.

విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం వంటి పలు సందర్భాలలో ఈ ఫండ్‌ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకోవచ్చు.

ఈపీఎఫ్‌ ఖాతా నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా చేసుకోవాలంటే ముందుగా యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌(యూపఎన్‌) పొందాలి

దీన్ని ఆన్‌లైన్‌లో యాక్టివేట్‌ చేసుకోవడం, కేవైసీ పూర్తిచేయడం, ఈ-నామినేషన్‌ దాఖలు, మొబైల్‌ నెంబరు అప్‌డేట్‌ వంటివి పూర్తి చేయాలి.

ఇందులో ఏ ఒక్కటి పూర్తి కాకపోయినా ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకోవడం సాధ్యం కాదు.

ఒక క్యాన్సిల్డ్ చెక్ కూడా జత చేయాల్సి ఉంటుంది.

తరువాత మీ అప్లికేషన్ సబ్మిషన్ ఒకే అయినట్టు మెసేజ్ విండో వస్తుంది

మీరు అప్లై చేసిన 10 రోజులలో నిబంధనల ప్రకారం మీకు ఎంత డబ్బు ఇచ్చే వీలుంటే అంత మొత్తం బ్యాంకు ఎకౌంట్ కి జమ చేస్తారు.