ప్రభాస్ ‘కల్కి2898 AD’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.
జూన్ 27న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది.
కేవలం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 415 కోట్లు కలెక్ట్ చేసింది
తాజాగా మేకర్స్ కల్కి విడుదలైన తర్వాత ఐదు రోజుల కలెక్షన్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
కల్కి ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 555 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదే జోరు కొనసాగితే త్వరలోనే కల్కి 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది.
‘పఠాన్’, ‘జవాన్’, ‘జైలర్’, బాహుబలి వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.