కంద దుంప‌లో విట‌మిన్ ఎ మ‌రియు విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి, కంద దుంపను వారానికి ఒక సారి తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులో ఉండే విట‌మిన్ ఎ కంటి స‌మ‌స్య‌లను దూరం చేస్తుంది.

విట‌మిన్ సి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డేలా చేస్తుంది.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా కంద దుంపను డైట్‌లో చేర్చుకోవాలి.

ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉండే కంద‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయి ఉన్న అద‌న‌పు కొవ్వును క‌రిగించి.బ‌రువు త‌గ్గేలా చేస్తుంది.

అధిక ర‌క్త‌పోటు ఉన్న వారికి కంద దుంప బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పాలి.ఎందుకంటే, కంద తీసుకోవ‌డం వ‌ల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ అయ్యి అధిక ర‌క్త‌పోటు అదుపులోకి వ‌స్తుంది.

credit: iStock

క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మినరల్స్ ల‌భ్య‌మ‌య్యే కంద దుంప‌ను వారానికి ఒక సారి తీసుకోవ‌డం వ‌ల్ల గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

credit: iStock

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కంద‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

credit: iStock

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కంద దుంప తీసుకోవడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుంది. దీని వల్ల మీరు ఫిట్ గా అవ్వొచ్చు. ఎందుకంటే దీనిలో ఉన్న ఫైబర్ బరువు తగ్గిస్తుంది.

వారానికి రెండు సార్లు మహిళలు కందని తీసుకోవడం మంచిది. అలానే యాంటి ఏజింగ్ లక్షణాలు కంద లో ఉన్నాయి

ముసలితనం త్వరగా రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖం పై ఉన్న ముడతలు కూడా తగ్గిస్తుంది.

ఇందులో మెగ్నీషియం, సెలీనియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెమరీ పవర్ ని పెంచుతాయి. 

అలానే ఇమ్యూనిటీ పవర్ ని కూడా కంద తో పెంచుకోవచ్చు.