మెంతుల్లో ఫోలిక్‌ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌తో పాటు విటమిన్‌ ఎ, బి6, సి, కె వంటి పోషాకలు పుష్కలంగా ఉన్నాయి. 

పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి మెంతులను శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

ప్రతి రోజూ ఉదయాన్నే నానబెట్టిన మెంతులు తీసుకుంటే జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. దీనివల్ల ఎసిడిటీని దూరం చేస్తాయి.మెంతులు తింటే.. మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

షుగర్‌ పేషెంట్స్‌ రాత్రిపూట మెంతులను నానబెట్టి తెల్లారి ఖాళీ కడుపుతో నీటితో పాటు తీసుకుంటే మంచిది. మొలకెత్తిన మెంతులు.. తీసుకుంటే ఇంకా మంచిది.

కఫం ఎక్కువగా ఉన్నవారు మెంతి గింజలను పొడిగా, నానబెట్టి, మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్న మంచిది.

బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తీసుకుంటే మేలు జరుగుతుంది. దగ్గును తగ్గించడంలో మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఆస్తమా, దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, కఫవ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి.

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తాయి.

ఇది హార్ట్ రేట్ నీ, బ్లడ్ ప్రెజర్ నీ కంట్రోల్ చేస్తుంది.

కిడ్నీలు చక్కగా పని చేయాడానికి మెంతులు సహకరిస్తాయి