గ్యాస్‌, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే మెంతులు మేలు చేస్తాయి.

మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి

ఎసిడిటీని దూరం చేస్తాయి

మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

షుగర్‌ పేషెంట్స్‌ రాత్రిపూట మెంతులను నానబెట్టి తెల్లారి ఖాళీ కడుపుతో నీటితో పాటు తీసుకుంటే మంచిది.

ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది.

కఫం ఎక్కువగా ఉన్నవారు మెంతి గింజలను పొడిగా, నానబెట్టి, మొలకెత్తిన ఏ రూపంలో తీసుకున్న మంచిది.

దగ్గును తగ్గించడంలో మెంతులు సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఆస్తమా, దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, కఫవ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి.