పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే అందం రెట్టింపు అవ్వడం ఖాయం..!!

 By Bhoomi

ఖాళీ కడుపుతో ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల టాక్సిన్స్ తొలగిపోతాయి. శరీరం లోపలి నుంచి శుభ్రం అవుతుంది. పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. 

కొబ్బరినీళ్లు చర్మంపై ముడతలు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి.  

ఉసిరికాయలో ఉండే విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముడతలు పడకుండా కాపాడుతుంది. 

దోసకాయ జ్యూసులో పాలకూర రసం కలిపి తాగితే చర్మం హైడ్రేట్ అవుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి  చర్మం మెరిసేలా చేస్తాయి. 

పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల సమస్యను తగ్గిస్తాయి. చర్మాన్ని మచ్చలు లేకుండా తాజాగా ఉంచుతాయి. బరువును కూడా తగ్గిస్తుంది. 

దానిమ్మలో విటమిన్లు, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. చర్మకణాలను పునరుద్ధరించే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

గ్రీన్ టీలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్లు, కాటెచిన్స్, చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది. చర్మాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. 

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. 

ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం ఉదయం కప్పు టీ లేదా కాఫీని ఈ రిఫ్రెష్ పానీయాలతో భర్తీ చేయండి.