వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకూడదంటే ఈ టీ తాగండి.

  By Bhoomi

చాలా మంది టీతో రోజును ప్రారంభిస్తారు. అలసట నుంచి ఉపశమనం పొందేందుకు టీని ఆశ్రయిస్తారు. వర్షాకాలంలో ఏ టీ తాగాలో తెలుసుకుందాం. 

 వర్షాకాలంలో ఈ టీ తాగుతే మిమ్మల్ని రిలాక్స్‎గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. 

వర్షాకాలంలో చాలా మందిని జలుబు, వైరల్ ఫీవర్లు ఇబ్బంది పెడుతుంటాయి. 

అల్లం టీ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 

అల్లంలో అనేక పోషకాలు ఉన్నాయి. దీన్ని టీ కలుపుకుని తాగితే ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

 తులసి ఆకుల్లో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జలుబు, ఫ్లూ నుంచి రిలాక్స్ చేస్తుంది. 

లికోరైస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ప్రొటీన్ వంటి పోషకాలెన్నో ఉన్నాయి. రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. 

 గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, పొటాషియం, జింక్, కాపర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.