ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు గ్యారెంటీ..!!

 By Bhoomi

భారత పోస్టల్ డిపార్ట్ మెంట్ దేశంలో ఎన్నో అద్బుతమైన పథకాలను తీసుకువస్తుంది. 

ఈరోజు మనం జనాదరణ పొందిన కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం. 

ఉద్యోగం లేకపోయినా పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 7.1శాతం వరకు వడ్డీ ఇస్తోంది. 

పోస్టాఫీసులో పొదుపు ఖాతా తెరిస్తే మీకు 4శాతం వడ్డీ లభిస్తుంది. ఆర్డీ ఖాతాలో, వడ్డీ 6.2శాతం చొప్పున ఇస్తారు. 

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీం కింద 5ఏళ్ల కాల వ్యవధిపై 7.5శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాదిలో 6.8శాతం, రెండేళ్లలో 6.9శాతం వడ్డీ అందుబాటులో ఉంటుంది. 

నెలవారీ ఆదాయ స్కీంలో పెట్టుబడి పెడితే 7.4శాతం వడ్డీని పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు ఈ పథకం నుంచి 8.2 శాతం వరకు ప్రయోజనం పొందుతారు.  

10ఏళ్ల లోపు ఆడపిల్లల కోసం సుకన్య సమ్రుద్ధి యోజన 8శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 

కిసాన్ వికాస్ పత్ర కింద కస్టమర్లు ఏప్రిల్ 1 నుంచి 7.5శాతం వడ్డీని పొందుతున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు 9ఏళ్ల, 7నెలల్లో రెట్టింపు అవుతుంది.