శరీరం త్వరగా డీహైడ్రేడ్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. దీంతో శరీరంలో సత్తువ తగ్గి అలసట, నీరసం పెరిగిపోతాయి.
మజ్జిగ అనేది సామాన్యుడి దగ్గర నుంచి అందరికి దొరికే పానీయం. దేవతలను అమృతం ఎలాగో.. మనకి వేసవి కాలంలో మజ్జిగ అలాగ అనమాట.
విషదోషాలు, చర్మరోగాలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన కొవ్వు, శరీరంలో అమిత వేడి తగ్గేందుకు మజ్జిగ ప్రయోజనకారిగా మారింది.
లక్టో బాసిల్లై అనే మంచి బ్యాక్టీరియా శరీరానికి మజ్జిగ ద్వారా లభిస్తుంది. అయితే శరీరానికి ఉపయోగపడే ఈ బ్యాక్టీరియా పాలల్లో ఉండదు.
మజ్జిగలో విటమిన్ ఎ, బి, సి, ఇ, కె వంటివి ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు. ఎండల వేడిమికి శరీరంపై ఎక్కువ చెమట విసర్జిస్తుంది. కాబట్టి వేసవిలో మజ్జిగ తరచుగా తీసుకోవడం వల్ల పోషకాల లోపాలన్నిటిని శరీరానికి చేరుస్తుంది.
వేసవిలో అత్యధికంగా బాధించే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు మజ్జిగ తీసుకోవడం చాలా ఉత్తమం. మజ్జిగలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కార్బోహైడ్రేట్లు, లాక్టోస్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి.
అసిడిటీ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే మజ్జిగ తీసుకోవడం ప్రయోజనకరం. దీని వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం వస్తుంది.
ఫాస్ట్ ఫుడ్ లేదా స్పైసీ ఫుడ్ తిని కడుపు అంతా ఉబ్బరంగా ఉన్న సమయంలో మజ్జిగ తీసుకోవడం మంచిది. ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఫుడ్‌లోని మసాలా ప్రభావాన్ని తగ్గిస్తుంది.