పాలు, నెయ్యిని కలుపుకుని తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండడంతో నెయ్యిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.

నెయ్యిని పాలల్లో కలుపుకుని తాగితే కీళ్ళు బలపడతాయి. పాలల్లో ఉన్న విటమిన్ డి ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది.

ఎముకల కీళ్ళలో పుట్టే మంటని నెయ్యి తగ్గిస్తుంది.ఏదైనా పని చేసి అలసిపోయినట్లుగా అనిపిస్తే పాలల్లో నెయ్యి వేసుకుని తాగండి. 

పిల్లల్లో జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెంపొందించడానికి పాలల్లో నెయ్యి వేసి తాగించండి. 

గర్భిణీ స్త్రీలు ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఎముకలకి బలం చేకూరుతుంది. పాలిచ్చే తల్లులకి బాగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

credit: iStock

నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్ధ ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు , పాలలోని విటమిన్లు చర్మం , జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెయ్యి, పాలను పోషకాహార అమృతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు