చపాతీలు పువ్వులా మెత్తగా ఉండాలంటే ఇలా చేయండి..!

 By Bhoomi

కొంతమందికి చపాతీలు చేయడం రాదు..గట్టిగా ఎండిపోయినట్లు ఉంటాయి. పువ్వులా మెత్తగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. 

చపాతీ పిండిలో కొంచెం గోరువెచ్చని నూనె వేసి నీరు పోసి కలపాలి. ముద్దలా చేసిన ఒక నిమిషం పక్కన పెట్టాలి. 

గుడ్డు తినేవారు అయితే పిండిలో గుడ్డులోని తెల్లసొన వేసి కలపాలి. దానిలో 2చుక్కల నిమ్మరసం వేసి చపాతీలు చేసుకోవాలి. 

పిండిలో పెరుగు వేస్తే మెత్తగా మారుతుంది. చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. 

హడావిడిగా పిండిని కలుపుతాం. అలా కాకుండా మెత్తని పిండిపై మస్లిన్ గుడ్డను నీటిలో నానబెట్టి, నీటిని పిండాలి. పిండిపై వేయాలి. 10నిమిషాలు అలాగే ఉంచి మళ్లీ పిండిని బాగా కలిపి చపాతీని చుట్టాలి.

చపాతీకి మెత్తదనాన్ని ఇవ్వడానికి పిండిని పిసికి కలుపుతున్నప్పుడు బేకింగ్ సోడా కలుపుతారు. పిండిలో చిటికెడు బేకింగ్ సోడా వేసి కలపాలి. 

నెయ్యి వేసి రోటీని మెత్తగా చేసుకోవచ్చు. పిండిని జల్లెడ పట్టండి. దానికి 1 టేబుల్ స్పూన్ వేడి నెయ్యి వేసి బాగా కలపాలి. 

దీని తర్వాత నీరు పోసి పిండిని కలపండి. ఈ పిండితో వెంటనే రోటీ చేస్తే మెత్తగా ఉంటుంది.