కోడిగుడ్లతోపాటు ఇవి తినకండి..అనారోగ్యానికి గురవుతారు..!!

 By Bhoomi

కొంతమంది అన్ని ఆహారపదార్థాలను కలుపుకుని తింటుంటారు. ఇలా తింటే ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉంటుంది. 

గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజుకో గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు.

అయితే గుడ్డుతో పాటు ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం. 

గుడ్డుతోపాటు చక్కెర పదార్థాలు ఎప్పుడూ తినకూడదు. ఈ రెండింటిని కలిపి తింటే రక్త గడ్డకట్టడంలో సమస్యలు తలెత్తుతాయి.

సోయాపాలు, గుడ్డు రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ ఈ రెండింటిని కలిపి తినకూడదు. 

గుడ్డు, చేపలు, చీజ్ కలిపి తినకూడదు. దీనివల్ల అలర్జీతోపాటు ఇతర వ్యాధులు వస్తాయి. 

గుడ్డు తిన్న వెంటనే టీ తాగకూడదు. ఇది మలబద్దకంతోపాటు కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. 

అరటిపండు, పుచ్చకాయ, పాల ఉత్పత్తులు గుడ్లతో కలిపి తినకూడదు.