అయోధ్యకు వెళ్లే రైళ్ల వివరాలివే..

అయోధ్య రామమందిరాన్ని కనులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. . 

ఏపీ, తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. 

సికింద్రాబాద్-అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి.

తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్టణం, విజయవాడ, శ్రీకాకుళంరోడ్ స్టేషన్లు

సికింద్రాబాద్-అయోధ్య రైళ్లు ఈ నెల 29 నుంచి రోజువిడిచి రోజు బయలుదేరుతాయి.

ఈ నెల 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరుతాయి.

కాజీపేట నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు కూడా రోజువిడిచి రోజు బయలుదేరుతాయి. 

విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి ఈ నెల 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న వెళ్తాయి. 

  సామర్లకోట నుంచి వచ్చే నెల 11న అయోధ్యకు రైళ్లు బయలుదేరుతాయి.