ప్రతీ ఒక్కరు ఇంట్లో వారానికి ఒకసారి చికెన్ తింటూనే ఉంటారు

అయితే చికెన్ కుక్ చేసే ముందు దాన్ని ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము 

చికెన్ సరిగ్గా క్లీన్ చేయకపోతే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

మాంసాన్ని శుభ్రం చేయడానికి ముందు, చేతులను శుభ్రం చేసుకోండి. ఇన్ఫెక్షన్ చేతుల ద్వారా కూడా వ్యాపిస్తుంది.

ఇప్పుడు వేడి నీళ్లలో ఉప్పు వేసి అందులో మాంసాన్ని కాసేపు ఉంచాలి.

వేడి నీటి నుంచి మాంసాన్ని తీసి, చల్లటి నీటిలో వేసి, చేతులతో పూర్తిగా శుభ్రం చేయండి.

ఆ తర్వాత నీటిలో నిమ్మరసం కలిపి చికెన్ క్లీన్ చేయండి. ఇది మాంసం పై ఉన్న రక్తం, జుట్టును తొలగిస్తుంది.

మాంసాన్ని శుభ్రం చేయడానికి వెనిగర్ కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ మాంసంలో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

పసుపు నీటిని కూడా ఉపయోగించవచ్చు. మాంసంలోని రక్తం పసుపు నీటితో బాగా శుభ్రపడుతుంది.

చికెన్ శుభ్రం చేసిన తర్వాత ఎక్కువసేపు నిల్వ చేయాలనుకుంటే, దానిని గట్టి కంటైనర్‌లో సీల్ చేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.