అనారోగ్యపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య మొదలవుతుంది

పురుషులలో ఈ జుట్టు రాలే సమస్య బట్టతలకు దారితీస్తుంది.

అయితే పురుషులలో జుట్టు రాలడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం

జుట్టుకు అధిక రసాయనాలు కలిగిన షాంపూలు, సబ్బులు వాడడం

జుట్టుకు రంగులు వేయడం. ఇది స్టైలింగ్ కోసం బాగానే ఉంటుంది. కానీ వీటిలోని కెమికల్స్ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు. బయట తినే ఆయిల్, రిఫైన్డ్ ఫుడ్స్ కూడా జుట్టు పెరుగుదల పై ప్రభావం చూపుతాయి.

జుట్టుకు కండీషనర్ అప్లై చేసిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోవడం జుట్టు రాలడానికి దారితీస్తుంది.

జుట్టు పెరుగుదల కోసం ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయండి. అలాగే వారానికి ఒకసారి జుట్టుకు పెరుగు ప్యాక్ వేయండి.