అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.
అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.
కెఫిన్ అనేది మెదడును చురుగ్గా.. అప్రమత్తంగా ఉంచే ఒక ఉద్దీపన.
అందువల్ల ఎక్కువ కాఫీ తాగడం వల్ల నిద్ర లేమి సమస్య వస్తుంది.
అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మన కడుపు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
కెఫిన్ కడుపులో ఆమ్ల పరిమాణాన్ని పెంచుతుంది.
ఇది గుండెల్లో మంట, గ్యాస్ లేదా ఆమ్లత్వానికి కారణమవుతుంది.
కొంతమందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి కూడా ఉండవచ్చు.
అధిక కాఫీ వినియోగం మూత్రవిసర్జన ప్రమాదాన్ని పెంచుతుంది.
రోజులో ఎక్కువగా కాఫీ లేదా టీ తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది.
కెఫిన్ అనేది శరీరం నుండి నీటిని తొలగించి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
ఎక్కువ కాలం కాఫీ లేదా టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దానికి బానిస అవుతుంది.
వైద్యులు కాఫీని మితంగా తీసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీ తాగడం సురక్షితం.