బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన రియల్ లైఫ్ స్టోరీస్

మైదాన్.. ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

రెయిడ్.. 1980లలో సర్దార్ ఇందర్ సింగ్‌ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన  ఆదాయ-పన్ను రైడ్ ఆధారంగా రూపొందించబడింది. 

జఖ్మ్.. బాలీవుడ్ ప్రొడ్యూసర్  మహేష్ భట్ తల్లి షిరిన్ మొహమ్మద్ అలీ జీవితం ఆధారంగా రూపొందించబడింది.

తాన్హాజీ..  ఛత్రపతి శివాజీ సహచరుడు తాన్హాజీ ధైర్యసాహసాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది

కంపెనీ.. ముంబైలోని అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అతని గ్యాంగ్ ఆధారంగా రూపొందించారు.

గంగా జల్.. బీహార్‌లోని తేజ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక IPS అధికారి జీవిత కథ ఆధారంగా రూపొందింది.

వన్స్ అపాన్ ఎ టైమ్ ముంబై.. ముంబై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్లు హాజీ మస్తాన్, దావూద్ ఇబ్రహీం జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్..భగత్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు.