ప్రస్తుతం మనందరిని కలవరపెడుతున్న ముఖ్యమైన సమస్య జుట్టు రాలిపోవడం.

రోజురోజుకి మారుతున్న వాతావరణంతో పాటు మనం తీసుకునే ఆహారంలో కూడా అనేక మార్పుల కారణంగా పట్టుకుంటేనే చేతిలోకి జుట్టు రాలి వచ్చేస్తుంది.

ఎక్కువ ధరలు పెట్టేసి జుట్టు రాలకుండా ఔషధాలు వాడేయకుండా..మన ఇంటి పెరట్లోనే జుట్టు రాలిపోకుండా చేసే ఔషధాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరికాయ పొడి.. ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నీళ్లతో కలిపి తలకి పట్టించి తలస్నానం చేయాలి.

మెంతుల్లో ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి

మందారంలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు దృఢత్వానికి అవసరమైన పోషకాలు. ఇవి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

వేపకు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇవి తలపై ఉండే సూక్ష్మక్రిములను చంపి, చుండ్రు మరియు దురదలను నివారిస్తాయి

తులసిలోని యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు తలపై చుండ్రును కలిగించే సూక్ష్మక్రిములను చంపి, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

బృంగరాజును 'మూలికల రాజు' అని పిలుస్తారు. అందుకే ఆయుర్వేదంలో బ్రింగరాజ్ జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.