సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా?

సపోటాలో విటమిన్‌ సీ, ఏ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారు వీటిని తింటే వెంటనే శక్తి వస్తుంది.

సపోటాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

సపోటాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.అందువల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

సపోటాలు సహజసిద్ధమైన లాక్సేటివ్‌లా పనిచేస్తాయి. అందువల్ల మలబద్దకం సమస్య ఉండదు.

సపోటాల్లో ఫైబర్‌, విటమిన్ ఎ, బి, సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

సపోటాల్లో ఉండే మెగ్నిషియం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది.