బొప్పాయి ఆకుల నుంచి తీసిన ర‌సం తాగేవారిలో ర‌క్తంలో ప్లేట్‌లెట్లు పెరుగుతాయని వైద్యులు చెపుతున్నారు.

డెంగీ జ్వ‌రం వ‌చ్చిన వారికి బొప్పాయి ఆకుల ర‌సం తాగిస్తే.. ప్లేట్‌లెట్స్ పెర‌గ‌డ‌మే కాదు, ర‌క్తం వృద్ధి చెందుతుంది.

కామెర్లు, కాలేయ వ్యాధులు వ‌చ్చిన వారు నిత్యం బొప్పాయి పండు ఆకుల ర‌సం తాగుతుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వచ్చే ఇబ్బందులు త‌ప్పుతాయి.

చుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా... బొప్పాయి ఆకుల రసం రాసేసుకోండి.

జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. జుట్టు మెరుస్తుంది కూడా... షాంపూ కండీషనర్‌లా ఇది పనిచేస్తుంది.

బొప్పాయి ఆకుల రసం... మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచగలదు. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి.

బొప్పాయి ఆకుల్లో ఫెనొలిక్ అనే కాంపౌండ్, పపాయిన్, అల్కనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లలా పని చేసి... శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాన్సర్ రాకుండా కూడా బొప్పాయి ఆకుల రసం ఉపయోగపడుతుంది.

గుండెలో నొప్పిగా ఉంటోందా, ఏదో అసౌకర్యంగా అనిపిస్తోందా... అయితే... బొప్పాయి ఆకుల రసం తాగితే మేలు. ఆకలి పెరగాలన్నా ఇది తాగొచ్చు.