సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

దీనిలో కాల్షియం, విటమిన్ సీ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

ఇవి రోజూ తింటే.. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇవి చర్మ సమస్యలనూ దూరం చేస్తాయి. 

సోంపు గింజలు తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు మంచి  ఔషధంలా పనిచేస్తాయి.

ఇది హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచడానికి నేచ్యరల్‌ రిమిడీలా పనిచేస్తుంది.

ఇవి తింటే గుండెల్లో మంట, వాంతుల ప్రభావం తగ్గుతుంది. తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ బాగా పని చేస్తాయి.ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను పెంచడానికి తోడ్పడతాయి. 

దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.సోంపు గింజలు శరీరంలోని కండరాలను రిలాక్స్‌ చేయడానికి సహాయపడతాయి