వేసవిలో లెమన్ జ్యూస్ తాగితే ఎన్ని బెనిఫిట్సో

వేసవిలో శరీరం హైడ్రేట్ గాఉండాలంటే నిమ్మరసం తీసుకోవాలి. శరీర పనితీరును మెరుగుపరచడంతోపాటు హైడ్రేట్ గా ఉంచుతుంది.  

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.  

నిమ్మరసం తాగితే రిఫ్రెష్ అనుభూతిని అందిస్తుంది. దాహాన్ని తీర్చడానికి అద్బుతమైన ఎంపిక. 

నిమ్మరసంలోని ఆమ్లత్వం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. అజీర్ణం, గుండెలో మంటను తగ్గిస్తుంది.

ఇంట్లో తయారు చేసే లెమన్ జ్యూస్ చక్కెర లేకుండా చేసుకుంటే మంచిది. 

మార్కెట్లో దొరికే ఇతర పానీయాలతో పోల్చితే ఇంట్లో తయారుచేసుకునే లెమన్ జ్యూసులో తక్కువ కేలరీలు ఉంటాయి.