నేరేడు ఆకులు, బెరడును కూడా ఔషధాల తయారీలో వాడతారు.పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.
యాంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్, కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి. నేరేడులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నేరేడు పండు తింటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. నేరేడు పండు రసం ఫైటో కెమికల్గా పనిచేస్తుంది. ఈ రసం తాగితే కాలేయం సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
దీనిలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. కాబట్టి హెల్తీ స్నాక్‌గా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఫుడ్ ఛాయిస్.
దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిని శుభ్రపరచడమే కాదు దంతాలు, చిగుళ్లను దృఢంగా చేస్తాయి కూడా.
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువ కాకుండా చూస్తుంది. గుండె కండరాలు గట్టిపడకుండా చూసి, హృదయ సంబంధవ్యాధుల్ని నివారిస్తుంది.
credit: iStock
అస్తమా, విపరీతమైన దగ్గు వంటి జబ్బుల్ని నయం చేయడంలో నేరేడు ఉపయోగపడుతుంది.
ఈ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో పాటు నీరు కూడా ఎక్కువే ఉంటుంది. వీటిని తింటే దాహం తీరుతుంది. అంతేకాదు శరీరం చల్లబడుతుంది కూడా.
ఎండిన నేరేడు పండ్ల పొడి చర్మం మీది ఎర్రని మచ్చలను పోగొట్టి, కాంతినిస్తుంది.
వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.
జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి.