బ్యూటీ టిప్స్...నవరాత్రుల్లో ఇలా మెరిసిపోండి...!!

 By Bhoomi

9రోజులపాటు జరిగే నవరాత్రుల్లో మీరు మెరిసే పోవాలంటే ఈ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి. 

తేలికపాటి ఫేస్ వాష్ ను ఉపయోగించండి. దీనికోసం మీరు శనగపిండి, పసుపు, పాలతో మిశ్రమాన్ని తయారు చేసి ముఖానికి అప్లయ్ చేయండి. 

పారాబెన్ ఫ్రీ టోనర్ ఉపయోగించండి. రోజ్ వాటర్ కూడా మంచి టోనర్. ఇది మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. 

హైబ్రోస్ పండగకు మూడు రోజుల ముందు చేయించుకోండి. వాటికి అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ ఉపయోగించండి. 

ఫిజికల్ సన్ స్క్రీన్ ను ఉపయోగించండి. స్నానానికి ముందు పెరుగు లేదా పాలను ముఖానికి అప్లయ్ చేస్తే ట్యానింగ్ తొలగిపోతుంది. .  

పడుకునే ముందు బాడీ లోషన్ రాయండి. చర్మం తేమాగా ఉంటుంది. 

పగిలిన గోళ్లకు క్యూటికల్ క్రీమ్ లేదా తేలికపాటి మాయిశ్చరైజర్ రాయండి. గోళ్లకు ఆలివ్ నూనె పూయండి. . 

4 లేదా 5 రోజలకు ఒకసారి ఫేస్ మాస్క్ చేసుకోండి. సూర్యరశ్మికి గురికాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి. 

పెదాలను తేమగా మార్చేందుకు నెయ్యిని అప్లయ్ చేయండి.