తమలపాకులో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో, అనేక వ్యాధులను నయం చేయడానికి తమలపాకు వాడతారు.

తమలపాకులో యాంటీ-టాక్సిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డయాబెటిక్‌, యాంటీ డయాబెటిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-క్యాన్సర్, యాంటీ-అల్సర్‌‌ లక్షణాలు ఉన్నాయి.

ప్రతి రోజూ ఉదయం.. ఖాళీ కడుపుతో తమలపాకు తింటే.. నోటి దుర్వాసన, క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.

తమలపాకులలో యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

ప్రతి రోజూ ఉదయం తమలపాకు తింటే.. నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది. తమలపాకు తింటే.. నోటి ఇన్ఫెక్షన్లు, అల్సర్లు కూడా తగ్గుతాయి.

 ప్రతి రోజూ తమలపాకు తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

తమలపాకులో యాంటీ-క్యాన్సర్ ఏజెంట్స్‌ ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌ కణాలతో పోరాడతాయి. క్యాన్సర్‌ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి.

తమలపాకులో గ్యాస్ట్రో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయి, ఇది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

తమలపాకులు శరీరంలో ఆక్సీకరణ ప్రక్రియను ప్రోత్సహించడానికి పని చేస్తాయి. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

తమలపాకులు తలనొప్పికి హోమ్‌ రెమిడీలా పనిచేస్తుంది. మైగ్రేన్‌ నుంచి ఉపశమనం పొందడానికి.. తమలపాకు ఉపయోగపడుతుంది.