సాధారణంగా వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ సీజన్‌లో తినే ఆహరం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ముఖ్యంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు
వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మష్రూమ్, సీఫుడ్ ఆహారాలు ఈ సీజన్ లో తక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు
వర్షాకాలంలో వంకాయ మొక్కలో ఫంగల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది
పచ్చి కూరగాయల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరిగి జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
పుట్టగొడుగు తేమతో కూడిన వాతావరణంలో పండిస్తారు. దీని కారణంగా వర్షాకాలంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.
వర్షాకాలంలో చేపలు లేదా రొయ్యలు వంటి సముద్రపు ఆహారం తినకుండా ఉండాలి.
ఇది సముద్ర జీవులకు సంతానోత్పత్తి సమయం. ఈ సీజన్‌లో చేపలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ వచ్చే ప్రమాదం ఉంది.