ఈ మధ్య కాలం అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య మొటిమలు.

దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలు.

అయితే మొహం మొటిమలను నివారించడానికి కొన్ని ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

ఆయిల్,రిఫైన్డ్ ఫుడ్స్ తినడం మానుకోవాలి. ఇవి మొటిమల సమస్యను మరింత పెంచుతాయి.

చాక్లెట్, అధిక చక్కెరతో కూడిన పదార్థాలు దూరంగా ఉండాలి.

జున్ను, ఫుల్ క్రీమ్ పాలు, పెరుగు ఐస్ క్రీం వంటి పాల ఉత్పత్తులను అతిగా తీసుకోవడం మొటిమలను కలిగిస్తాయి.

ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవాలి. ఇవి మొటిమలకు కారణమవుతాయి.