ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న మరో టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు చూశారా?

చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

సెప్టెంబర్ 30న తన చిరకాల ప్రియుడు మిలింద్ చంద్వానితో అవికా వివాహం జరిగింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అవికా వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి.

తన పెళ్లి కోసం అవికా రెడ్ కలర్ గాగ్రా చోళీలో అందంగా ముస్తాబైంది.

నుదుటిపై బొట్టు, ఒంటి నిండా ఆభరణాలు, కల్యాణ తిలకంతో చూడడానికి రెండు సరిపోవు అన్నట్లుగా ముస్తాబైంది అవికా.

వరుడు మిలింద్ క్రీమ్ కలర్ శర్వాణీ ధరించారు. అవికా, మిలింద్ జంట అభిమానులను ఫిదా చేస్తోంది.

వీరి పెళ్లి వేడుకకు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తారలు హాజరయ్యారు.

హీనా ఖాన్, రాకీ జైస్వాల్, రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా, గురుమీత్ చౌదరి, దేబినా బెనర్జీ, మమతా లేహ్రీ, స్వరా భాస్కర్, ఫహద్ అహ్మద్, గీతా ఫోగట్ అవికా పెళ్ళిలో సందడి చేశారు.

ఈ ఏడాది జూన్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న అవికా- మిలింద్ జంట.. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.