టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండను  ఎన్​టీఆర్​ ఫిల్మ్ అవార్డ్ వ‌రించింది. 

శనివారం హైదరాబాద్ లోని హోటల్‌ దసపల్లాలో శ‌నివారం ఎన్​టీఆర్​ ఫిల్మ్ అవార్డుల వేడుక గ్రాండ్ గా జరిగింది. 

ఈ అవార్డు వేడుకల్లో నటుడు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎన్​టీఆర్​ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. 

ఆనంద్  బ్లాక్ బస్టర్ 'బేబీ' సినిమాకు గానూ ఈ అవార్డు వరించింది. 

బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. 

ఆనంద్ ఇటీవలే 'గం గం గణేష' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు వచ్చారు . 

మే 31 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. 

ఆనంద్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి బేబీ చిత్ర తారాగణంతోనే తీయబోతున్నట్లు తెలుస్తోంది