అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జ
ులై 12 న అంగరంగ వైభవంగా జరిగింది.
పెళ్ళిలో వధువు రాధికా గుజరాతి స్టైల్ లెహంగాలో రాయల్ గా కనిపించింది.
గుజరాతీ సంప్రదాయంలో ముస్తాబైన రాధికా రెడ్ అండ్ వైట్ కలర్ లెహంగాధరించింది.
సంక్లిష్టమైన డిజైన్స్ అలంకరించబడిన అబూ జానీ సందీప్ ఖోస్లా లెహంగాలో వధువు రాధికా లుక్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఐవరీ జర్దోజీ కట్-వర్క్, పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాతో రూపొందిన పొడవాటి ఘాగ్రా రాయల్ లుక్ అందించింది.
రాధికా తన వెడ్డింగ్ లుక్ కోసం వారసత్వ ఆభరణాలను ఎంచుకుంది.
రాధిక అద్భుతమైన డైమండ్ సెట్, పచ్చ హారము, గాజులు, కలీరాలతో అలంకరించబడి ఎంతో అందంగా మెరిసింది.
వెడ్డింగ్ గ్లామ్ కోసం రాధికా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేసే మినిమల్ మేకప్ తో కనిపించింది.
రాధికా వెడ్డింగ్ స్టైలిష్ రియా కపూర్ ఈ ఫోటోలను షేర్ చేశారు.