ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు.

 By bhavana

ఓ గిన్నెలో నీరు పోసి, వాటిలో ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పెడితే చాలు.. దోమలు పరార్ అనాల్సిందే. 

జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు, తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది.

ఉల్లి తొక్కల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి. 

ఉల్లి తొక్కలతో సూప్ చేసుకొని తాగితే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెట్టే బెడా సర్దుకొని బయటకు పోతుంది.

అధిక బరువు తగ్గి, సన్నగా, చక్కటి శరీర ఆకృతి వస్తుంది. ఫలితంగా గుండె హ్యాపీగా ఉంటుంది.

ఉల్లి తొక్కల్ని 10 నుంచీ 20 నిమిషాలు నీటిలో మరగబెట్టాలి. ఆ తొక్కల్ని తీసేసి, నీటిని టీ లాగా తాగేయాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే మంచిది.

మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది.

ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది.