నేల పై కూర్చొని భోజనం చేయడం ద్వారా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

కింద కూర్చొని తినడం వల్ల శరీర కదలిక పెరుగుతుంది.

ఇది జీర్ణక్రియ, రక్త ప్రసరణన, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

నేల పై కూర్చొని భోజనం చేయడం ద్వారా మనసును రిలాక్స్ గా ఉంచడంతో పాటు అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ప్లేట్‌ను నేల పై ఉంచి, తినడానికి శరీరాన్ని ముందుకు వంచడం ద్వారా కడుపు కండరాలు చురుకుగా ఉంటాయి.

దీని వల్ల కడుపులో యాసిడ్ స్రావం పెరిగి ఆహారం వేగంగా జీర్ణమవుతుంది.

కింద కూర్చొని భోజనం చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది.

ఇది నరాలను ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

పద్మాసనం, సుఖాసనం ధ్యానానికి ఉత్తమమైన భంగిమలు.

ఇది మనసులోని ఒత్తిడిని దూరం చేయడంలో చాలా మేలు చేస్తాయి.