దుబాయ్‎ అద్భుతంగా ఉండేందుకు కారణం ఇవే..!!

By Bhoomi

యూఏఈలోని లగ్జరీ నగరాల్లో దుబాయ్ ఒకటిగా పరిగణిస్తారు. 

అల్ట్రా మోడ్రన్ భవనాలు, వాస్తు శిల్పం, అత్యాధునిక విలాసవంతమైన నగరంగా దుబాయ్ పేరుగాంచింది. 

దుబాయ్ మాల్  1200 చదరపు మీటర్లలో విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్ద మాల్‎గా గుర్తింపు పొందింది. 1200దుకాణాలు, 26 థియేటర్లు, 120కిపైగా కేఫ్‎లు రెస్టారెంట్లు ఉన్నాయి.

దుబాయ్ అక్వేరియం ట్యాంక్ ప్రపంచంలోనే అతిపెద్దది. కోటి లీటర్ల నీటిని కలిగి ఉంది. 33వేలకు పైగా జలచరాలు ఉన్నాయి. 

 492 అడుగుల ఎత్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పిక్చర్ ఫ్రేమ్ ఉంది. 

ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా ఇక్కడే ఉంది. దీని ఎత్తు 3 ఈఫిల్ టవర్లకు సమానం. 

దుబాయ్ ఎమిరేట్స్ మాల్లో నిర్మించిన ఈ ఇండోర్ స్కీయింగ్ చల్లని ప్రాంతాల్లో ఉన్న అనుభూతినిస్తుంది. 

155 మిలియన్ ఏళ్ల నాటి డైనోసార్ శిలాజం ది దుబాయ్ మాల్ లో ప్రదర్శనకు ఉంది. 

ఇండోర్ నేపథ్య వినోద గమ్యస్థానం. 17 నేపథ్య రైడ్స్ ను కలిగి ఉంది.