అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన చిత్రం ఏజెంట్.
గతేడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అఖిల్ కెరియర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. రిలీజైన 15 నెలల తర్వాత రావడం గమనార్హం.
జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం
రిలీజైన ఫస్ట్ డేనే విపరీతమైన నెగిటివ్ టాక్ రావడంతో చాలామంది థియేటర్లో సినిమాని చూడలేదు.
దాంతో ఓటీటీలోకి వస్తే చూద్దామని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు.
మరి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి