'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి.
తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
గతంలో గ్లామర్‌కు దూరంగా ఉన్న ఈ 'బేబమ్మ', ఈ మధ్య వరుస ఫొటోషూట్‌లతో అభిమానులకు కనులవిందు చేస్తోంది.
తాజాగా ఆమె షేర్ చేసిన స్టైలిష్ లుక్స్, చీరకట్టు ఫొటోలు, మోడ్రన్ డ్రెస్సుల్లోని గ్లామరస్ పోజులు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా చమ్కీల చీరలో ఆమె అందాలు ఆరబోస్తూ చేసిన ఫొటోషూట్ అభిమానులను ఫిదా చేసింది.
వరుస పరాజయాల కారణంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి.
అయినప్పటికీ కృతి శెట్టి ప్రస్తుతం తమిళం, మలయాళ చిత్రాలపై దృష్టి పెట్టింది.
విజయపజయాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
ఇలా తన గ్లామర్ షోతో మేకర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని టాక్ నడుస్తోంది.
ఈ అమ్మడి కొత్త ఫొటోలు చూసి నెటిజన్లు 'వావ్', 'సూపర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.