టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘సత్యభామ’ . 

జూన్ 07న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. 

ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఈ చిత్రంలో కాజల్ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో  నటించింది.

నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు హర్ష వర్ధన్,  పాయల్ రాధాకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. 

ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ భారతీయుడు 2 లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. 

ఈ చిత్రం జులై 12న విడుదల కానుంది.